తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

క్రికెట్​ బెట్టింగ్​లు నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్టు - cricket betting

జల్సాలకు అలవాటు పడి క్రికెట్​ బెట్టింగ్​లు నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 45వేల రూపాయలు, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

cricket betting organisers arrested in hyderabad
క్రికెట్​ బెట్టింగ్​లు నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్టు

By

Published : Oct 8, 2020, 7:21 PM IST

క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరిని పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 45 వేల రూపాయలు, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. బోయిన్‌పల్లి, సీతారాంనగర్‌ ప్రాంతాలకు చెందిన రాజేష్‌కుమార్‌ బంగ్‌, పవన్‌కుమార్‌ అటల్‌ ఆహార ధాన్యాల వ్యాపారం నిర్వహిస్తున్నారు.

జల్సాలకు అలవాటు పడడం వల్ల డబ్బులు భారీగా ఖర్చు చేస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని భావించిన వీరిద్దరు.. బెట్టింగ్‌లు నిర్వహించడమే వృత్తిగా పెట్టుకున్నారు. బీఎండబ్ల్యూ ఈఎక్స్​హెచ్‌ అనే లింకుతో చరవాణుల ద్వారా వీరిద్దరు సంవత్సర కాలంగా పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. నిర్వాహకులిద్దరిని అరెస్టు చేశారు.

ఇవీ చూడండి: తప్పుడు ధ్రువపత్రాలతో ఎస్​ఐ ఉద్యోగం.. తర్వాత ఏమైంది..?

ABOUT THE AUTHOR

...view details