తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బెట్టింగ్​ ముఠా అరెస్ట్​: రూ 2 లక్షల నగదు స్వాధీనం - CRICKET_BETTING_MUTA_ARREST

మహబూబాబాద్​లో క్రికెట్​ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

మహబూబాబాద్​లో బెట్టింగ్​ ముఠా అరెస్ట్

By

Published : May 4, 2019, 12:14 AM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షల 10 వేల నగదు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. వాట్సాప్, గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే, వంటి యాప్​ల ద్వారా బెట్టింగ్​లకు పాల్పడుతున్నారు. టాస్ నుంచి మొదలుకొని విజేతలు ఎవరు, ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు, బాల్​ టూ బాల్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి రివార్డులు అందజేశారు.

మహబూబాబాద్​లో బెట్టింగ్​ ముఠా అరెస్ట్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details