తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ఇద్దరు గ్రామ వాలంటీర్లు..ఓ రైల్వే ఉద్యోగి.. - cricket betting update

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో పోలీసులు అరెస్టు చేసిన క్రికెట్​ బెట్టింగ్​ ముఠాలో ఇద్దరు గ్రామ వాలంటీర్లతో పాటు ఓ రైల్వే ఉద్యోగి ఉన్నారు. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ మెుదలైనప్పటి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా బెట్టింగ్​లు నిర్వహిస్తున్నారు. ఈ బెట్టింగ్​లతో యువత జీవితం నాశనం అవుతోంది. దీన్ని కట్టడి చేసేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఏపీ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి బుకీల నుంచి నగదు, సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

cricket-betting-gangs-arrest-in-state-wide
క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ఇద్దరు గ్రామ వాలంటీర్లు..ఓ రైల్వే ఉద్యోగి..

By

Published : Nov 4, 2020, 2:06 PM IST

అనంతపురం జిల్లాలో..

క్రికెట్ బెట్టింగ్​ ఆడుతున్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఓ రైల్వే కానిస్టేబుల్ సహా 24 మందిని ఏపీలోని అనంతపురం జిల్లా గుడిబండ పోలీసులు అరెస్టు చేశారు. వీరందరూ గుడిబండ జూనియర్ కళాశాల ముందు సీసీ గిరి గ్రామంలోని పాఠశాల వద్ద క్రికెట్ బెట్టింగ్​ నిర్వహిస్తున్నారని... డీఎస్పీ మహబూబ్ బాషా వివరించారు. నిందితుల నుంచి 23 మెుబైల్ ఫోన్లు, 79 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్య క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసిన ఎస్సైలను డీఎస్పీ అభినందించారు.

కడప జిల్లాలో..

కడప జిల్లా వేముల మండలంలో జూనియర్ కాలేజీ ప్రాంగణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై సంజీవరెడ్డి వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే ముందస్తు సమాచారంతో దాడులు చేసినట్లు వివరించారు. పట్టుబడిన ఆరుగురు నిందితుల నుంచి 85 వేల నగదు 5 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్​లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

కడప అక్కయ్యపల్లెలోని అక్కదేవతల గుడి సమీపంలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు కడప సీఐ నాగభూషణం తెలిపారు. నిందితుల నుంచి 70 వేల నగదు, 5 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ పోటీలు ముగిసే వరకు నిఘా కట్టుదిట్టం చేశామనీ.. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడితే వారిని జిల్లా బహిష్కరణ చేస్తామని సీఐ హెచ్చరించారు.

ఇదీ చదవండి:బాలుడు​ కిడ్నాప్​ డ్రామా- రూ.50కోట్లు డిమాండ్

ABOUT THE AUTHOR

...view details