మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 10 మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి లక్షా 20 వేల నగదు, 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు వ్యక్తులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. బెట్టింగ్‌ల వైపు ఆకర్షితులవుతున్న 12 మంది యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు.
ఐపీఎల్ క్రికెట్ ముఠా అరెస్టు... లక్షా 20 వేల నగదు స్వాధీనం - cricket betting in mahaboobnagar
మహబూబాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 10 మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి లక్షా 20 వేల నగదు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురిని త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.

ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ క్రికెట్ బెట్టింగ్, జిల్లా కేంద్రాలు పాకిందని... గ్రామాలకు పాకే అవకాశం ఉందన్నారు. ఓవైపు ఆన్లైన్లో మరోవైపు మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని... ఎవరికీ అనుమానం రాకుండా మెడికల్ ఏజెన్సీలో నడుపుతున్నట్లు వెల్లడించారు. గూగుల్ పే, పేటీఎం ద్వారా నగదును ట్రాన్స్ఫర్ చేస్తున్నారని తెలిపారు.
కుటుంబ సభ్యులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ఇంట్లో నగదు మాయమైతే వెంటనే గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు.