హైదరాబాద్ పాతబస్తీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇర్ఫాన్ ఖాన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ షకీల్లను చార్మినార్ పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.44,500 నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పాతబస్తీలో క్రికెట్ బెట్టింగ్... ముగ్గురు అరెస్ట్ - హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్ పాతబస్తీలో క్రికెట్ బెట్టింగ్ ముఠాని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పాత బస్తీలో క్రికెట్ బెట్టింగ్... ముగ్గురు అరెస్ట్
ప్రధాన నిందితుడు అనిల్ అగర్వాల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి చార్మినార్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి:ఆపదలో ఆశ్రయమిస్తే.. 'అమ్మ'నే హత్య చేశాడు!