తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తాగిన మైకంలో ఓ వ్యక్తి వీరంగం... కట్టేసి కొట్టిన స్థానికులు - Vemulawada Latest News

ఫూటుగా తాాగాడు ఓ వ్యక్తి... అంతటితో ఆగకుండా తాగిన మైకంలో వీరంగం సృష్టించాడు. అది గమనించిన స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు.

Created a commotion in a drunken stupor
తాగిన మైకంలో వీరంగం... కట్టేసి కొట్టిన స్థానికులు

By

Published : Jan 7, 2021, 2:39 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో తాగిన మైకంలో వీరంగం సృష్టించిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. పట్టణానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి .. జాతర గ్రౌండ్‌లో తెల్లవారుజామున తాగిన మైకంలో దుకాణాలకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడు.

గమనించిన స్థానికులు పట్టుకొని కట్టేసి చితకబాదారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నించగా.. తాగిన మైకంలో ఏం చేస్తున్నానో తెలియడం లేదని బదులిచ్చాడు. పోలీసులు నిందితుడి కట్లు విప్పి వదిలేసి వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details