నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రతి ఒక్కరు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉందని సీపీ కమలాసన్ రెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని ఎన్టీఆర్ కూడలి నుంచి కమాన్ కూడలి వరకు దాతల సహాయంతో కొత్తగా ఏర్పాటు చేసిన 151 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.
అన్ని ప్రధాన రహదారుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంలో భాగంగా తొలుత 108 పాయింట్లలో కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో వాహనాల నంబర్లను కూడా నమోదు చేసే అత్యాధునిక కెమెరాలు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడానికి విరాళాలు ఇచ్చిన వారిని ఆయన సన్మానించారు.