వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఆవును చంపిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గత నెల 24న ఐదుగురు వ్యక్తులు.. అటవీ ప్రాంతంలో ఆవును తుపాకీతో కాల్చి చంపారు.
ఆవును చంపిన కేసులో నలుగురికి రిమాండ్ - వికారాబాద్ దామగుండం అటవీ ప్రాంతంలో ఆవును చంపిన దుండగులు
వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో ఆవుపై దాడి చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. గత నెల 24న ఐదుగురు వ్యక్తులు.. ఆవును తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.
ఆవును చంపిన కేసులో రిమాండ్‌కి నలుగురు నిందితులు!!
వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. వీరిలో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా ముగ్గురు తిర్మలాపూర్ గ్రామానికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. అసలు నిందితుల్ని వదిలేసి తమ వాళ్లని పట్టుకున్నారంటూ తిర్మలాపూర్ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్‌రావు నియామకం