పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేట పరిసరాల్లో ఆవుపై పులి దాడి చేసి చంపింది. నాలుగు రోజులుగా ముత్తారం మండలంలో పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు పులి అడుగులు గుర్తించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పులి ఆవుపై దాడి చేసిందనే సమాచారంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పులి దాడిలో ఆవు మృతి.. ఆరు పశువులకు తీవ్ర గాయాలు - మచ్చుపేటల ఆవులపై పులి దాడి
పశువులపై దాడి చేసి... పులి ఆవును చంపిన ఘటన... పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేటలో చోటుచేసుకుంది. నాలుగు రోజులుగా ముత్తారం మండలంలో పులి సంచరిస్తుందన్న సమాచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పులి దాడిలో ఆవు మృతి.. ఆరు పశువులకు తీవ్ర గాయాలు
మచ్చుపేట గ్రామ సమీపంలోని బగుళ్ళగుట్టకు పశువులను మేతకు తీసుకెళ్తుంటారు. ఈ రోజు కూడా పసువుల కాపరి రాజయ్య మేతకు తీసుకెళ్తుండగా... పులి దాడి చేసి పశువులను గాయపరిచింది. అటవీ అధికారులు సుమారు మూడు గంటల పాటు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పులి దాడిలో ఆవు చనిపోయినట్లు ముత్తారం ఎస్ఐ నరసింహారావు, అటవీశాఖ అధికారి నరసయ్య ధ్రువీకరించారు.