గ్రామస్థుల ఒత్తిళ్లు తాళలేక కరోనా బాధితుడి ఆత్మహత్య... - మెదక్లో కరోనా బాధితుడి ఆత్మహత్య
09:22 August 03
గ్రామస్థుల వైఖరితో కరోనా బాధితుడి ఆత్మహత్య
మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం కూచన్‌పల్లిలో దారుణం జరిగింది. కరోనా బాధితుడిని ఊరిలోనుంచి వెళ్లిపోవాలని గ్రామస్థులు ఒత్తిడి చేశారు. తెల్లారేసరికి బాధితుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గ్రామస్థుల వైఖరితోనే కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. కరోనా సోకడంతో బాధితుడు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉందని ఊరు నుంచి వెళ్లిపోవాలని గ్రామస్థులు యువకుడిపై ఒత్తిడి తెచ్చినట్లు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.