కొవిడ్ రోగుల వద్ద కొట్టేసిన ఇంజెక్షన్లు, మందులను కొనుగోలు.. చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ మెడికల్ దుకాణం యజమానిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మెహదీపట్నంలోని ఓ మందుల షాపు యజమానితో పాటు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో పనిచేసే మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రోగుల వద్ద కరోనా మందులు కొట్టేసి.. బ్లాక్‌లో అమ్మే ముఠా అరెస్ట్ - విడ్-19 మందులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ మెడికల్ షాపు యజమాని
కొవిడ్-19 మందులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ మెడికల్ షాపు యజమానిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే కొందరు సిబ్బంది కరోనా రోగులకు ఇచ్చే మందులను దొంగలించి మెహదీపట్నంలోని ఓ మందుల దుకాణంలో విక్రయిస్తున్నారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
మెహదీపట్నం ప్రాంతంలోని ఆలివ్ ప్రైవేట్ ఆసుపత్రిలో వార్డ్ బాయ్‌గా పనిచేస్తున్న రవి రాజు, అజిస్.. సమీరా ఆస్పత్రిలో పనిచేసే ఒబేద్ అలీ, అశ్వక్ అలీ, ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే సునీల్ మరో సేల్స్‌మెన్ మజీద్ వీరంతా ఇన్ పేషెంట్‌గా ఉన్న కొవిడ్ రోగుల వద్ద నుంచి ఇంజెక్షన్లు, మందులను దొంగిలిస్తున్నారు.
కొట్టేసిన ఇంజెక్షన్లు, మందులను మెహదీపట్నంలోని ఓ మెడికల్ దుకాణంలో అమ్మేవారు. మెడిసిన్ ఖరీదు రూ. 4,500 అయితే బ్లాక్‌లో రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరందరిని అదుపులోకి తీసుకున్నారు.