తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కారు దొంగతనం కేసులో మాజీ ఎమ్మెల్యేపై చీటింగ్​ కేసు - Cheating Case Against Former MLA Latest News

తన కారు దొంగతనం చేసి బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యపై ఓ వ్యక్తి కేసు వేశారు. అయితే అది ఇవాళ కోర్టులో విచారణకు రాగా.. సదరు మాజీ ఎమ్మెల్యేపై చీటింగ్, దొంగతనం కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

Court approves cheating case against former MLA Abbayya
Court approves cheating case against former MLA Abbayya

By

Published : Nov 3, 2020, 5:16 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య తనను మోసం చేసి... తన కారును దొంగతనం చేసి బెదిరిస్తున్నారని టేకులపల్లికి చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి... ఇల్లందు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వేసిన ప్రైవేట్ పిటిషన్​ను కోర్టు విచారణకు స్వీకరించింది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యపై చీటింగ్, దొంగతనం కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఐపీసీ సెక్షన్ 379, 420, 294 బి, 403, 407, 506 ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఇల్లందు పోలీస్ స్టేషన్​కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. లాక్​డౌన్​కు ముందు వేసిన కేసు నేపథ్యంలో ఇవాళ విచారణకు స్వీకరించిన కోర్టు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details