కామారెడ్డి జిల్లాలో జరిగిన ఓ పెళ్లిలో బంధువుల రూపంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. బంధువులు గమనించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
పెళ్లిలో బంధువులమంటూ తిరిగారు.. బంగారం ఎత్తుకెళ్లి ఇలా దొరికారు - Theft at a wedding in Kamareddy district
ఓ పెళ్లి జరుగుతోంది. అందులో ఓ జంట హడావుడిగా తిరిగారు. మీరు ఎవరు అని అడిగిన పెళ్లి వాళ్లకు సైతం అనుమానం రాకుండా బంధువులమంటూ చెప్పుకున్నారు. ఆ తర్వాత అదును చూసి మెల్లగా పెళ్లి కుమార్తె బంధువువల వద్ద బంగారాన్ని దొంగలించారు. గమనించిన బంధువులు వారిని పట్టుకుని చితక్కొట్టారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
పెళ్లిలో బంధువులమంటూ తిరిగారు.. బంగారం ఎత్తుకెళ్లి ఇలా దొరికారు
అసలు దొంగతనం ఎలా జరిగిందంటే?
కామారెడ్డి అయ్యప్ప ఫంక్షన్హాల్లో జరిగిన పెళ్లిలో బంధువులుగా చెప్పుకుంటూ... పెళ్లి కుమార్తె బంధువులకు సంబంధించిన మూడు తులాల బంగారాన్ని దంపతులు దొంగలించారు. దీన్ని గమనించిన బంధువులు... బంగారం దొంగిలించిన వారిని పట్టుకుని చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బంగారాన్ని దొంగలించిన దంపతులు ఇందిరానగర్ కాలనీకు చెందిన పరమేశ్, యశోదలుగా గుర్తించారు.