తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వ్యక్తిని హత్య చేసిన భార్యాభర్తలు.. అసలేం జరిగిందంటే? - Sangareddy District Latest News

సైబరాబాద్ కమిషనరేట్​ పరిధి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం కానుకుంటలో ఈనెల 8న తుకారం అనే వ్యక్తిని భార్యాభర్తలు హత్య చేశారు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన తుకారంతో భర్త గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరూ తుకారం తలపై కర్రలతో కొట్టగా.. అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేశారు.

Sangareddy District Crime News
వ్యక్తిని హత్య చేసిన భార్యభర్తలు.. అసలేం జరిగిందంటే?

By

Published : Nov 10, 2020, 12:15 AM IST


వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన గోసాయి కృష్ణ అతని భార్య కృష్ణవేణి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం కానుకుంటలో ఉన్న గుడిసెల్లో ఉంటూ కూలిపని చేసుకుని జీవిస్తున్నారు. ఈ నెల 8న రాత్రి లింగంపల్లి సమీపంలో ఉన్న మద్యం దుకాణానికి వెళ్లి మద్యం తీసుకున్నారు. మహారాష్ట్ర లాతూర్​కు చెందిన తుకారాం అనే వ్యక్తి గ్రేటర్ అన్నపూర్ణ భోజన విభాగంలో పని చేస్తున్నాడు. ఇతను కూడా అదే మద్యం దుకాణానికి వెళ్లి అక్కడే ఉన్న కృష్ణవేణి చేతిని పట్టి లాగి.. ఆమె మొహం మీద కొట్టాడు.

అనంతరం కృష్ణ, కృష్ణవేణిలు వారి గుడిసె లోపలికి వెళ్లి పడుకున్నారు. తర్వాత తుకారాం కూడా వచ్చి గుడిసెలో కృష్ణవేణి పక్కన పడుకున్నాడు. దీనితో కృష్ణవేణి పెద్దగా కేక పెట్టింది. తన భర్త కృష్ణ మేల్కొని మద్యం మత్తులో ఉన్న తుకారాంను బయటకు నెట్టాడు. తుకారాం వారితో గొడవ పడ్డాడు. దీంతో భార్యాభర్తలిద్దరూ తుకారాం తలపై కర్రలతో, సీసాలతో గట్టిగా కొట్టారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి:సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌

ABOUT THE AUTHOR

...view details