పొలంలో దంపతుల దారుణ హత్య
17:43 June 09
పొలంలో దంపతుల దారుణ హత్య
కరీంనగర్ జిల్లా కొండపాకలో దారుణం జరిగింది. భూతగాదాల కారణంగా భార్యభర్తలను కత్తితో గొంతుకోసి అతికిరాతకంగా హత్య చేశారు. వీణవంక మండలం కొండపాక మాజీ ఎంపీటీసీ పూరెళ్ల సుశీలమ్మతోపాటు భర్త పోశాలు వ్యవసాయ పనులు చేసుకుంటున్న క్రమంలో ఈ దారుణం చోటుచేసుకొంది. పక్క వ్యవసాయ భూమి యజమాని కుటుంబ సభ్యులు కత్తితో గొంతుకోయడం వల్ల దంపతులు ఇద్దరు అక్కడికక్కడే చనిపోయినట్లు గ్రామస్థులు చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా వీరి భూవివాదం కోర్టులో కొనసాగుతోంది.
మరోవైపు భూసమస్య పరిష్కరించాలంటూ మృతులు రెవెన్యూ అధికారులు, పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఇవాళ దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటున్న క్రమంలో తమ వ్యవసాయ భూమి ఇక్కడి వరకు ఉందంటూ సరిహద్దు రాళ్లను పక్కకు తొలగించిన క్రమంలో ఈ హత్యకు పాల్పడ్డారు. ఇద్దరు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇవీ చూడండి:కాపురానికి రానందుకు భార్య, మామను కిరాతకంగా చంపిన భర్త