కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గొల్లాడి తండాలో ప్రమాదవశాత్తు పత్తి కుప్ప దగ్ధం అయింది. బస్సీ బీర్మల్ అనే రైతుకు చెందిన పత్తి నిప్పుల పాలైంది. సుమారు 2.5 ఎకరాల్లో సాగు చేసిన పంట కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు.
ప్రమాదవశాత్తు పత్తి కుప్ప దగ్ధం... 'ప్రభుత్వమే ఆదుకోవాలి' - కామారెడ్డి జిల్లా లేటెస్ట్ న్యూస్
రెండున్నర ఎకరాల్లో సాగు చేసిన పత్తిని చూసి ఆ రైతు ఎంతో పొంగి పోయాడు. పంట చేతికి వచ్చిందని మురిసిన సంతోషం ఎంతో కాలం నిల్వలేదు. ప్రమాదవశాత్తు పొలంలోనే పంట మొత్తం దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే ఆ అన్నదాత ఆశలు కాలిపోయాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గొల్లాడి తండాలో జరిగింది.
ప్రమాదవశాత్తు పత్తి కుప్ప దగ్ధం... ప్రభుత్వమే ఆదుకోవాలి
ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపే కుప్ప పూర్తిగా కాలిపోయిందని వాపోయారు. ఎలాగైనా ప్రభుత్వమే తమని ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.