తెలంగాణ

telangana

By

Published : Oct 12, 2020, 1:49 PM IST

ETV Bharat / jagte-raho

కరోనా చికిత్స పేరుతో రూ. 5.5 లక్షల బిల్లు.. రోగి మృతి

కరోనా చికిత్స పేరుతో కార్పొరేట్​ ఆస్పత్రుల దోపిడీ రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. తాజాగా నగరంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కొవిడ్​ సోకిందనే అనుమానంతో ఓ కార్పొరేట్​ ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తికి చికిత్స పేరిట రూ. లక్షల్లో బిల్లు వేశారు. 5 రోజుల చికిత్స అనంతరం రోగి చనిపోయాడని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకి దిగారు.

corona patient died in slg hospital hyderabad
కరోనా చికిత్స పేరుతో రూ. 5.5 లక్షల బిల్లు.. రోగి మృతి

నిజాంపేట మున్సిపాలిటీ బాచ్​పల్లిలోని ఎస్ఎల్​జీ కార్పొరేట్​ ఆస్పత్రిలో కరోనా సోకిన వ్యక్తి మృతి చెందాడు. బొల్లారం గ్రామానికి చెందిన గ్యారాల కుమార్​(50) కూలి పని చేస్తూ జీవనం సాగించేవాడు. 5 రోజుల క్రితం కరోనా సోకిందనే అనుమానంతో కార్పొరేట్​ ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు అతనికి కరోనా సోకిందని చెప్పి 5 రోజుల పాటు చికిత్స చేశారు. రూ. 5 లక్షల 50 వేల బిల్లు వేసి ఉదయం రోగి చనిపోయాడని చెప్పారు.

కుమార్​ ఆస్పత్రిలో చేరేటప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అతని కూతురు పేర్కొంది. యాజమాన్యం వైఖరికి నిరసనగా మృతుని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకి దిగారు.

కరోనా చికిత్స పేరుతో రూ. 5.5 లక్షల బిల్లు.. రోగి మృతి

ఇదీ చదవండి:నేడు ఏడో విడత కమాండర్​ స్థాయి చర్చలు

ABOUT THE AUTHOR

...view details