కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. మృతుని భార్య, కొడుకుతో పాటు అతని తమ్ముని కుటుంబం కూడా కరోనా బారిన పడి హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు.
కరోనాతో వ్యక్తి మృతి.. కుటుంబ సభ్యులే అంత్యక్రియలు! - కామారెడ్డి జిల్లాలో కరోనా మరణాలు
కామారెడ్డి జిల్లా అన్నారం గ్రామంలో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కాగా కొవిడ్ బారిన పడిన కుటుంబసభ్యులే పీపీఈ కిట్లు ధరించి.. నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు పూర్తి చేశారు.
కరోనాతో వ్యక్తి మృతి.. గ్రామస్థుల ఆందోళన
అయితే మంగళవారం రాత్రి రెండు గంటల సమయంలో బాధితుడు మరణించడం వల్ల కుటుంబ సభ్యులే పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని ట్రాక్టర్లో స్మశాన వాటికకు తరలించారు. సామాజిక దూరం పాటిస్తూ సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా బాధితుడు మృతి చెందడం వల్ల గ్రామంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి:కార్పొరేట్ ఆస్పత్రుల దందా అరికడతాం: కేసీఆర్