యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని హుస్నాబాద్‌లో కొందరు పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో భువనగిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. వారి నుంచి రూ.12,910 నగదు, ఐదు చరవాణీలు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశామని భువనగిరి పోలీసులు తెలిపారు.
ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్ - ఏడుగురు పేకాట రాయుళ్లును అరెస్ట్ చేసిన భువనగరి పోలీసులు
భువనగిరి పట్టణంలోని హుస్నాబాద్ ప్రాంతంలో ఏడుగురు పేకాట రాయుళ్లను భువనగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 12, 910 నగదు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు.
![ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్ cord players arrest in husnabad bhuvangiri town yaydadri bhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7064951-thumbnail-3x2-ygt.jpg)
ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్