తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పోలీసులకు సవాలు విసురుతున్న దొంగలు - కామారెడ్డి జిల్లా నేర వార్తలు

కామారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. విద్యుత్​ శాఖకు చెందిన పరికరాల్లో ఆయిల్, కాపర్ వైర్లు దొంగిలిస్తూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు చోరి జరగడంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

copper-wire-thieves-challenged-to-the-police
పోలీసులకు సవాలు విసురుతున్న దొంగలు

By

Published : Dec 17, 2020, 9:03 AM IST

గుర్తు తెలియని దుండగులు నాలుగు విద్యుత్ నియంత్రికల నుంచి ఆయిల్, కాపర్ వైర్లను దొంగిలించిన ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని ధర్మారం గ్రామం శివారులో జరిగింది. జిల్లాలోని మద్నూర్ బిచ్కుంద పిట్లం జుక్కల్ మండలాల్లో వరుసగా ఈ తరహా చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయని విద్యుత్​ శాఖ అధికారులు తెలిపారు.

కేవలం 15 రోజుల వ్యవధిలో జిల్లాలోని 15 విద్యుత్ నియంత్రికల నుంచి ఆయిల్, కాపర్ వైర్లను చోరీ చేసిన దొంగలు విద్యుత్ శాఖ అధికారులకు తలనొప్పిగా తయారయ్యారు. తమను పట్టుకోండి చూద్దాం అన్నట్లుగా పోలీసులకు సవాలు విసురుతున్నారు.

ఇది చూడండి:'గీత మా అమ్మాయే.. ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details