తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కంటైనర్ కింద పడిన ద్విచక్ర వాహనం.. ఒకరు మృతి - మేడ్చల్​ తాజా వార్తలు

మేడ్చల్ ఐటీఐ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు కంటైనర్​ కిందపడ్డారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కంటైనర్​... ఒకరు మృతి
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కంటైనర్​... ఒకరు మృతి

By

Published : Dec 14, 2020, 4:13 PM IST

మేడ్చల్​లోని ఐటీఐ కళాశాల ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో అత్వెల్లికి చెందిన నర్సింహ(14) మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు.

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లికి చెందిన నర్సింహ, బాబు ద్విచక్ర వాహనంపై మేడ్చల్​ నుంచి తిరిగి వస్తున్నారు. ఐటీఐ కళాశాల వద్ద ఎదురుగా ఉన్న వాహనాన్ని ఓవర్​టేక్ చేస్తున్న క్రమంలో కంటైనర్ కిందపడ్డారు. ప్రమాదంలో నర్సింహ మృతి చెందగా.. బాబు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనలో మైనర్​కు వాహనం ఇచ్చిన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కంటైనర్​... ఒకరు మృతి

ఇదీ చూడండి:హిమాచల్​ గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details