భర్త పెట్టే బాధలు భరించలేక... జీవితంపై విరక్తి చెంది చెరువులో దూకబోయిన మహిళను ఓ పోలీసు కాపాడి తన వృత్తి ధర్మాన్ని చాటుకున్నారు. హైదరాబాద్‌లోని నందనవనం బస్తీకి చెందిన ముగ్గురు పిల్లలు గల రాజేశ్వరి తన భర్త పెట్టే బాధలు భరించలేక మీర్పేట్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది.
చెరువులో దూకబోయిన మహిళను కాపాడిన కానిస్టేబుల్ - conistable saved a women news
భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. చెరువులోకి దూకి చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. కానీ దేవుడే ఓ కానిస్టేబుల్ రూపంలో వచ్చాడు. ఆ మహిళ ప్రాణాలు కాపాడాడు.
చెరువులో దూకబోయిని మహిళను కానిస్టేబుల్
అటు వైపు నుంచి వెళ్తున్న మీర్పేట్ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ యాదగిరి గమనించి ఆమె దగ్గరికి వెళ్లాడు. వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తన భర్త రోజూ తాగి వచ్చి తనను, తన పిల్లల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని బాధితురాలు తన గోడు వెల్లబోసుకుంది. అందుకే చనిపోదామనుకున్నానని తెలిపింది. సమస్యలు సద్దుమనుగుతాయని కానిస్టేబుల్ నచ్చ చెప్పి ఆమెను పోలీసు స్టేషన్కు తరలించారు. మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ని పలువురు ఉన్నతాధికారులు అభినందించారు.
Last Updated : Jan 13, 2021, 10:49 PM IST