మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్లో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో హనుమాన్సింగ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
తాగుడికి బానిసలుగా మారిన హనుమాన్ సింగ్, నర్సింగ్ సింగ్ అనే అన్నదమ్ములు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన తమ్ముడు నర్సింగ్ సింగ్ అన్న హనుమాన్ సింగ్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన హనుమాన్సింగ్ అక్కడే కుప్పకూలిపోయాడు.