మద్యం మత్తు ఓ హత్యకు దారి తీసింది. వెయిటర్ల మధ్య జరిగిన గొడవలో ఒకరి తలపై ఇనుప రాడ్డుతో దాడి చేయగా మరో వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడ ఏకే ఫంక్షన్ హాల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇద్దరు వెయిటర్ల మధ్య గొడవ.. ఒకరి హత్య - ఇద్దరి మధ్య గొడవలో ఒకరి హత్య
ఇద్దరు వెయిటర్ల మధ్య గొడవ హత్యకు దారితీసింది. చిలకలగూడలోని ఓ ఫంక్షన్‌హాల్ వద్ద ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి రాడ్డుతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వీరిద్దరిని మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
వెయిటర్ల మధ్య గొడవ...ఒకరి హత్య
మద్యం మత్తులో పండిత్ అనే వ్యక్తి ఆనంద్‌పై దాడి చేయగా తలకు తీవ్ర గాయాలై మరణించాడు. వీరిద్దరూ మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. గొడవకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలంలో క్లూస్ టీం పలు ఆధారాలను సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:బాలికను లైంగికంగా వేధిస్తున్న రైల్వే ఏఎస్సై అరెస్ట్