కుమురం భీం ఆసిఫాబాద్ మండలంలోని ఎల్లారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య జరిగిన వాగ్వాదంలో సబ్బాని శంకర్ అనే వ్యక్తి మృతి చెందాడు.
సబ్బాని శంకర్‌కు చెందిన మేకలు తన పక్కింటి బోయిని శంకర్ ఇంట్లోకి చొరబడి పప్పు కింద పడేశాయి. ఫలితంగా ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరిగి.. వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సబ్బాని శంకర్ బోయిని శంకర్ భార్య లక్ష్మిపై దాడి చేశాడు. ఘటనలో లక్ష్మి నడుము విరిగింది.
కోపోద్రిక్తులైన బోయిని శంకర్ కుటుంబ సభ్యులు కర్రలతో, గొడ్డలితో సబ్బాని శంకర్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. తలకు తీవ్ర గాయాలైన శంకర్ స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే సబ్బాని శంకర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి ఇవీ చూడండి:కరోనా వ్యాప్తి కట్టడికి తెలంగాణ తీసుకున్న చర్యలు భేష్'