వరంగల్ అర్బన్ జిల్లాలోని వసంతపురం గ్రామంలో దారి కోసం గుండెకారి బాబు, గుండెకారి జగదీశ్ మధ్య గత కొద్దికాలంగా గొడవ జరుగుతూ ఉండేది. ఇవాళ ఉదయం మాట మాట పెరిగి, కర్రలతో ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగారు. కర్రలతో దాడికి దిగడంతో బాబు భార్య తలకి తీవ్రగాయాలయ్యాయి.
మాటమాట పెరిగి.. కర్రలతో కొట్టుకున్నారు! - కుటుంబాల మధ్య గొడవ వార్తలు
రెండు కుటుంబాల మధ్య మాట మాట పెరిగింది. దీనితో కర్రలతో ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో మహిళలకు తీవ్రగాయాలయ్యాయి.

'మాటమాట పెరిగింది.. కర్రలతో కొట్టుకున్నారు..'
అడ్డుకున్న మరో మహిళకు కూడా గాయాలయ్యాయి. కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై గీసుకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం వల్ల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి:తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ