తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గుండారంలో ఇరువర్గాల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు - latest crime news in kamareddy district

స్థలం విషయంలో ఇరువర్గాలు గొడవకు దిగిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం గుండారంలో చోటుచేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Conflict between the two factions in kamareddy district
గుండారంలో ఇరువర్గాల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు

By

Published : Sep 16, 2020, 1:57 PM IST

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం గుండారంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గత 20 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 351లో ప్రభుత్వం తమకు నాలుగు ఎకరాల భూమి కేటాయించిందని ఓ కులం వారు చెబుతున్నారు. అదే గ్రామానికి చెందిన మరో కులస్తులు ఈ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని వారు గొడవకు దిగారు.

గత రెండు మూడు రోజుల నుంచి ఆ స్థలంలో ఓ కులస్తులు చెట్లు నరికి గుడిసెలు వేసే ప్రయత్నం చేయగా రజకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.

ఇదీ చదవండి:పోలీసులే లక్ష్యంగా మందుపాతర... నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్

ABOUT THE AUTHOR

...view details