మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం బొప్పారంలో భూ తగాదాల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు తమ వ్యవసాయ భూముల్లో ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో మహిళపైకి దూసుకురావడంతో స్థానికులు ఆమెను పక్కకు తప్పించారు.
ఇరు వర్గాల మధ్య ఘర్షణ - బొప్పారంలో కర్రలతో కొట్టుకున్న ఇరు వర్గాలు వార్తలు
మంచిర్యాల జిల్లా బొప్పారంలో భూతగాదాల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

ఇరు వర్గాల మధ్య ఘర్షణ
ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. రెండేళ్ల నుంచి ఇరు వర్గాల మధ్య భూ తగాదాలు జరుగుతున్నాయి. భూ వ్యవహారం కోర్టులో ఉండటం వల్ల సమస్యను పరిష్కరించడానికి అధికారులూ ముందుకు రావడం లేదు.
ఇరు వర్గాల మధ్య ఘర్షణ
TAGGED:
ఇరు వర్గాల మధ్య ఘర్షణ