తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

స్నేహితుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు - అల్వాల్​లో స్నేహితుల మధ్య ఘర్షణ వార్తలు

అల్వాల్ పోలీస్​స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్​లో ఆకాశ్​, శుభం అనే ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం.. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Conflict between friends .. Injuries to many
స్నేహితుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

By

Published : Aug 8, 2020, 9:43 AM IST

ఆకాశ్​, శుభంలు కొద్దిరోజులుగా ఒకరిపై మరొకరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణలతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుందామని ఇందిరానగర్​లోని ఆకాశ్​ ఇంటికి తమ స్నేహితులతో చేరుకున్నారు.

మాట్లాడుతున్న క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్నేహితుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

ఇదీచూడండి: దగ్గు మందు అమ్మినందుకు మెడికల్​షాప్​ యజమాని అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details