మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ పంచవటి కాలనీలో పెంపుడు కుక్క (సీజర్) అదృశ్యమైందని.. దాని యజమాని ఆనంద్ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న రాత్రి నుంచి తన పెంపుడు కుక్క కనిపించట్లేదన్నారు.
పెంపుడు కుక్క అదృశ్యం.. పోలీసుల గాలింపు ముమ్మరం - kushaiguda police station latest news
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో తన పెంపుడు కుక్క తప్పిపోయిందంటూ దాని యజమాని ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుక్క కోసం గాలిస్తున్నారు.
అదృశ్యమైన పెంపుడు కుక్క.. గాలిస్తున్న కుషాయిగూడ పోలీసులు
ఎలాగైనా తన పెంపుడు కుక్కను వెతికిపెట్టాలని కుషాయిగూడ పోలీసులను కోరారు. ఆనంద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కుక్క కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండిఃఆళ్లగడ్డలో చోరీ... రూ.లక్ష అపహరణ