తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కార్పొరేషన్‌ సిబ్బందిపై కాలనీవాసుల దాడి.. కేసు నమోదు - Greater Warangal Corporation Latest News at Hanmakonda

హన్మకొండలో గ్రేటర్ వరంగల్‌ కార్పొరేషన్‌ సిబ్బందిపై 42వ డివిజన్ కాలనీవాసులు చేయి చేసుకున్నారు. రోడ్డుపై అక్రమంగా కట్టిన గోడలు కూల్చి వేస్తుండగా దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Colonial attack on Greater Warangal Corporation staff
గ్రేటర్ వరంగల్‌ కార్పొరేషన్‌ సిబ్బందిపై కాలనీవాసుల దాడి

By

Published : Jan 11, 2021, 9:55 PM IST

హన్మకొండలో గ్రేటర్ వరంగల్‌ కార్పొరేషన్‌ సిబ్బందిపై 42వ డివిజన్ కాలనీవాసులు చేయి చేసుకున్నారు. రోడ్డుపై అక్రమంగా కట్టిన గోడలు కూల్చి వేస్తుండగా అడ్డుకుని దాడి చేశారు.

ట్విట్టర్ ద్వారా..

డివిజన్ ప్రాంతం గొల్లపల్లి యాదవనగర్‌లో సుగుణమ్మ, నిలవేణి, రాజేశ్వరీ, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సీసీ రోడ్డుకు అడ్డుగా గోడ నిర్మించారు. ఆ విషయాన్ని కార్పొరేషన్ కమిషనర్ పమేల సత్పతికి ట్విట్టర్ ద్వారా కొందరు ఫిర్యాదు చేశారు. వెంటనే అది కూల్చి వేయాలని అదేశించడంతో సిబ్బంది, పోలీసులతో కలిసి అధికారులు అక్కడికి వెళ్లారు.

గతంలో ఇక్కడ పట్టాలు ఇచ్చారని, దానిపైనే మేము గోడ కట్టామని బాధితులు చెప్పారు. గోడ కూల్చేస్తుండగా వారికి, మున్సిపల్ సిబ్బందికి, పోలీసులకు తీవ్ర తోపులాట జరగడంతో ఒకరినొకరు నెట్టేసుకున్నారు.

ఆవేశంలో..

బాధితులు ఆవేశంలో మున్సిపల్ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. పట్టా కాగితాలు ఉన్నాయని, మా భూమిలోనే సీసీ రోడ్డు వేశారని ఆరోపించారు. దాడి చేసిన వారిపై అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:చందాలు వేసుకుని వాగుపై వంతెన నిర్మించారు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details