తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భూ అక్రమాలపై తహసీల్దార్​ను సస్పెండ్​ చేసిన కలెక్టర్​ - రాజంపేట మండల తహసీల్దార్ మోతి సింగ్ సస్పండ్​

అనేక భూ కుంభకోణాలు బయటపడుతున్నా.. అధికారుల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా మరో అధికారి భూ అక్రమాలకు పాల్పిడి దొరికిపోయాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్​ ఆయనను సస్పెండ్​ చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

collector-suspended-the-tehsildar-at-kamareddy-district
భూ అక్రమాలపై తహసీల్దార్​ను సస్పెండ్​ చేసిన కలెక్టర్​

By

Published : Jan 7, 2021, 6:29 PM IST

కామారెడ్డి జిల్లాలో మరో అధికారి అక్రమాలకు పాల్పడి దొరికిపోయాడు. జిల్లాలోని రాజంపేట మండల తహసీల్దార్ కె.మోతి సింగ్​ను జిల్లా కలెక్టర్​ శరత్ కుమార్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు పాలనాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

రాజంపేట మండలం షేర్ శంకర్ తండాలోని భూములను ఐదుగురికి నిబంధనలకు విరుద్ధంగా పట్టా పాస్ పుస్తకాలు అందించాడు. సమాచారం తెలుసుకున్న జిల్లా పాలనాధికారి తహసీల్దార్​ను సస్పెండ్ చేశారు.

ఇదీ చూడండి :అగ్ని ప్రమాదం.. 3 లక్షల ఆస్తినష్టం

ABOUT THE AUTHOR

...view details