కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి కత్తితో రెచ్చిపోయాడు. బొండాలు కొనడానికి వచ్చిన వ్యక్తి తొడపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. జిల్లా కేంద్రంలో కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి దగ్గరికి గాంధారికి చెందిన సర్దార్ వెళ్లాడు. బోండాల ధర విషయంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన బొండాలు అమ్మే వ్యక్తి.. సర్దార్ తొడపై కత్తితో దాడి చేశాడు.
కొబ్బరిబోండా విషయంలో గొడవ..కత్తితో దాడి - kamareddy dist news
కొబ్బరి బొండాలు కొనడానికి వచ్చిన వ్యక్తిపై అమ్మకం దారుడు కత్తితో దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. బొండా ధర విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన బొండాలు అమ్ముకునే వ్యక్తి కొనుగోలుదారునిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
బేరం కుదరలేదు.. కత్తితో దాడి చేశాడు
అంతటితో ఆగకుండా తనకు పోలీసులందరూ తెలుసంటూ కత్తి పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తీవ్రంగా గాయపడిన సర్దార్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.