హైదరాబాద్ నగర శివారు బండ్లగూడ సన్‌సిటీ ప్రాంతంలో కొకైన్ విక్రయిస్తున్న ఇద్దరు ఆఫ్రికన్లను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 25గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు. గత వారం రోజుల క్రితం సులేమాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని అతడిచ్చిన సమాచారంతో కొకైన్ విక్రయిస్తున్న వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కొకైన్ విక్రయిస్తున్న ఇద్దరు ఆఫ్రికన్లు అరెస్ట్ - cocain-arrest
హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఇద్దరు ఆఫ్రికన్లను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ నంబర్లు కనిపించకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
cocain-arrest
బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్ కస్టమర్లతో ఆర్డర్ తీసుకుంటున్నారని అంజిరెడ్డి అన్నారు. కస్లమర్లకు ఫోన్ నంబర్ కాకుండా పెయిడ్ యాప్ ఉపయోగించి వేరే నంబర్ కనిపించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారని వివరించారు. ఆర్డర్ ఇవ్వడానికి కస్టమర్‌తో వీడియో కాల్ మాట్లాడుతుంటారని పేర్కొన్నారు. వీడియో కాల్ స్క్రీన్‌షాట్ ఆధారంగా వీరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కేసీఆర్ యాగాలు చేస్తే మోదీకి ఎందుకు భయం