తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తీర్పు అనుకూలంగా రాలేదని న్యాయవాదిపై దాడి - ఏపీ నేర వార్తలు

తీర్పు తనకు అనుకూలంగా రాలేదని న్యాయవాదిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా మాచర్లలో ఘటన చోటుచేసుకుంది.

client-attack-on-lawyer-in-guntur in Andhrapradesh
తీర్పు అనుకూలంగా రాలేదని న్యాయవాదిపై దాడి

By

Published : Nov 30, 2020, 10:38 PM IST

న్యాయవాదిపై ఓ వ్యక్తి దాడి చేసి గాయపర్చిన ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో జరిగింది. మాచర్లకు చెందిన న్యాయవాది యాండపల్లి కృష్ణమూర్తిపై కంభంపాడు గ్రామానికి చెందిన వి.పాపారావు అనే వ్యక్తి చిన్నపాటి గొడ్డలితో దాడి చేశాడు. 2014 నుంచి పాపారావుకి సంబంధించిన కేసులు వాదిస్తున్నట్లు బాధితుడు కృష్ణమూర్తి తెలిపారు.

ఒక సివిల్ కేసులో కోర్టులో అనుకూలంగా తీర్పు రాలేదనే కారణంతో తనపై కక్ష పెంచుకున్నాడని.. కోర్టు నుంచి బయటకు వచ్చాక గొడ్డలితో దాడి చేశాడని పేర్కొన్నారు. న్యాయవాది ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాచర్ల పట్టణ ఎస్సై మోహన్ వెల్లడించారు.

ఇదీ చూడండి:కల్లు దుకాణం పెట్టారని దాడి.. పలువురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details