తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

యువకుల మధ్య ఘర్షణ... ఒకరు మృతి - హైదరాబాద్​ తాజా వార్తలు

వాహన ప్రమాదం విషయంలో యువకుల మధ్య తలెత్తిన ఘర్షణ ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఫైజల్ అనే యువకుడిపై ఐదుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేయడంతో... అతను మృతిచెందిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Breaking News

By

Published : Jan 14, 2021, 6:51 AM IST

వాహన ప్రమాదం విషయంలో యువకుల మధ్య తలెత్తిన ఘర్షణ ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. రెండు రోజుల కిందట నాసర్ అనే వ్యక్తి వాహనాన్ని ఫైజల్ ఢీ కొట్టడంతో అతని వాహనం పాడయ్యింది. ఈ క్రమంలో నాసర్ తన స్నేహితులను వెంటబెట్టుకుని వాహన ప్రమాదం విషయంలో మాట్లాడేందుకు ఫైజల్​ను పిలిపించారు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో నాసర్, అతని వెంట వచ్చిన యువకులు ఫైజల్​పై దాడి చేశారు.

ఒక్కసారిగా అందరూ కలిసి దాడి చేయడంతో ఫైజల్ స్పృహ కోల్పోయి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని... ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఫైజల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి: సంక్రాంతి సంబురం... కళకళలాడిన శిల్పారామం

ABOUT THE AUTHOR

...view details