గతంలోని ఓ కేసు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అమర్లబండలో ఇరువర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. గ్రామ సర్పంచ్ లత భర్త రాజేశ్వర్ కుటుంబానికి మాజీ ఉపసర్పంచ్ స్వామి కుటుంబానికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో స్వామితో పాటు అతని తల్లి సిద్దవ్వ, మోహన్లకు గాయాలయ్యాయి.
ఇరువర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు - telangana news
గతంలోని ఓ కేసు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అమర్లబండలో ఇరువర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. గ్రామానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
స్వామి సదాశివనగర్ పోలీస్ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు స్వీకరించలేదు. దీంతో పోలీసులకు స్వామి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వివాదం జరిగింది. విచారణ నిమిత్తం గ్రామానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.