నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మర్లగొండ తండాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్ర కలకలం సృష్టించింది. పాత కక్షల కారణంగా కారోబార్ కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులపై ఎంపీటీసీ సహా ఆయన వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో కారోబార్తో పాటు మరో ఐదుగురుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కారుకు సైకిల్ అడ్డుందని ఘర్షణ.. కర్రలతో ఇరువర్గాల దాడి - మర్లగొండ తండాలో ఘర్షణ
తన కారుకు సైకిల్ అడ్డుగా ఉందన్న కారణంతో మొదలైన గొడవ... కర్రలతో కొట్టుకునేంత వరకు వెళ్లింది. పాతకక్షలు సైతం ఉండటం వల్ల చిన్న కారణమైనా... పెద్ద ఘర్షణే అయ్యింది. ఇరువర్గాల్లో పలువురికి గాయాలు కాగా... ఆరుగురు ఆసుపత్రి పాలయ్యారు.
clash in marlagonda thanda for cycle on road
ఎంపీటీసీ వర్గానికి చెందిన అరుణ్... మర్లగొండలో కారులో వస్తున్న క్రమంలో వీధిలో కారోబార్కి చెందిన సైకిల్ అడ్డుగా ఉన్న విషయమై గొడవ మొదలైంది. చిలికి చిలికి గాలివానైనట్లు... చిన్న గొడవ కాస్తా ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాల మధ్య పాత కక్షలు సైతం ఉండటం వల్ల కర్రలతో దాడి చేసుకునే దాక వెళ్లింది. దాడిని ధ్రువీకరించిన పోలీసులు... ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.