తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇద్దరు తాగుబోతుల మధ్య ఘర్షణ... ఒకరికి గాయాలు - telangana news

పూటుగా తాగిన ఇద్దరు తాగుబోతులు గొడవకు దిగారు. మాటమాట పెరిగి ఓ తాగుబోతు బీరుసీసాతో మరో తాగుబోతు కడుపులో పొడిచాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రాంగోపాల్ పేట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

ఇద్దరు తాగుబోతుల మధ్య ఘర్షణ... ఒకరికి గాయాలు
ఇద్దరు తాగుబోతుల మధ్య ఘర్షణ... ఒకరికి గాయాలు

By

Published : Dec 29, 2020, 5:39 PM IST

మద్యం మత్తులో ఇద్దరు తాగుబోతుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ప్యారడైజ్ వద్ద ఉన్న మహారాజా బార్ సమీపంలో ఇద్దరు తాగుబోతుల వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కమల్ అనే వ్యక్తి మరో తాగుబోతుపై బీరు సీసాతో దాడి చేశాడు.

బీరు సీసా కడుపులో దిగడం వల్ల బాధితుడికి తీవ్ర రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దాడికి పాల్పడిన వ్యక్తిని ప్రయత్నం చేయగా పరారయ్యాడు. దాడిలో గాయపడ్డ వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి :రాష్ట్రంలో యూకే వైరస్​ కలకలం... ఆరోగ్యశాఖ అప్రమత్తం

ABOUT THE AUTHOR

...view details