దొంగనోట్ల చెలామణికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ వెల్లడించారు. జిల్లాలోని అల్లదుర్గ్ గ్రామానికి చెందిన ఉప్పరి ప్రసాద్ గతంలోనూ నకిలీ నోట్ల చెలామణి కేసులో నిందితుడేనని పేర్కొన్నారు. అతని వద్ద నుంచి కారు, తొమ్మిది రెండువేల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 7వ తేదీన విజయనగర్ కాలనీలోని ఓ షాపులో నకిలీ రెండువేల నోటుతో 200 రూపాయలు కొనుగోలు చేసి రూ.1800 నగదును తీసుకెళ్లినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.