సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి సమీపంలో లారీ, మూడు బొలెరో వాహనాల్లో తరలిస్తున్న అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చౌక దుకాణాలు, రేషన్ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో విక్రయించేందుకు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్టు పౌరసరఫర శాఖ అధికారులు తెలిపారు. సుమారు 6 లక్షల విలువైన 300 క్వింటాళ్ల బియ్యం సహా వాహనాలను అదుపులోకి తీసుకున్నారు.
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం.. మూడు వాహనాలు పట్టివేత - రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సంగారెడ్డి జిల్లా చిరాగ్ పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఒక లారీ మూడు బొలెరోవాహనాల్ని సీజ్ చేశారు.
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం.. మూడు వాహనాలు పట్టివేత
పోలీసుల రాకతో బియ్యం తరలిస్తున్న నిందితులు పరారయ్యారు. పట్టుబడిన వాహనాలు బియ్యాన్ని జహీరాబాద్ పౌరసరఫరాల గోదాంకు తరలించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుల వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని చిరాగ్ పల్లి ఎస్సై గణేష్, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు సురేష్, బసవయ్య తెలిపారు.
ఇదీ చూడండి:అక్రమంగా తరలిస్తున్న గంజాయి, నిషేధిత గుట్కా పట్టివేత