తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రభుత్వంపై యూట్యూబ్​ ఛానల్​ అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు - ప్రభుత్వం, డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు

ఏపీ సర్కార్​తో పాటు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్​పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్ తెలుగు అలెర్ట్​​పై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐడీ ఏడీజీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

cid registered case on a youtube channel
ప్రభుత్వం అనుచిత వ్యాఖ్యలు.. యూట్యూబ్ ఛానల్​పై కేసు

By

Published : Oct 30, 2020, 4:50 PM IST

ఏపీ ప్రభుత్వం, ఏపీ డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్ తెలుగు అలెర్ట్​​పై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, జగన్​ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కామన్ మాన్ ఫైర్స్ అని ఓ వీడియోను తెలుగు అలెర్ట్​లో అప్​లోడ్ చేశారని సీఐడీ పోలీసులకు విజయవాడ న్యాయవాది బి.శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. సదరు వీడియోను యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏడీజీ ఆదేశాలతో..

డీజీపీ, సర్కార్​కు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ.. యూట్యూబ్ ఛానల్​లో ప్రసారం చేశారని లేఖలో వివరించారు. ఛానల్​పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ ఆదేశాలతో సీఐడీ అధికారులు సదరు యూట్యూబ్ ఛానల్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి:ఇకపై మొబైల్​లో పబ్​జీ ఉన్నా గేమ్ ఆడలేరు..

ABOUT THE AUTHOR

...view details