తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మద్యం మత్తులో సీఐ వాహనంతో పరార్​

మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు పోలీసుల వాహనం చోరీకి విఫలయత్నం చేశాడు. అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న యువకులను గమనించిన సీఐ... వారిని విచారించేందుకు అక్కడికి వెళ్లారు. యువకులతో మాట్లాడుతుండగా... కళ్లుగప్పిన దుండగుడు వాహనంతో పరారయ్యాడు.

ci-vehicle-stolen-by-young-man-at-miryalaguda-in-nalgonda
మద్యం మత్తులో సీఐ వాహనంతో పరార్​

By

Published : Nov 13, 2020, 10:35 AM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ సర్కిల్ ఇన్​స్పెక్టర్ రమేశ్​ బాబు వాహనం చోరీకి గురైంది. మిర్యాలగూడ పట్టణంలో ఈదుల గూడెం వద్ద అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న యువకులను సీఐ విచారిస్తుండగా... పోలీసుల కళ్లుగప్పి వంశీ అనే యువకుడు పోలీసు వాహనంతో పరారయ్యాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని పోలీసు వాహనం ఢీకొనడంతో కారు ముందు భాగం ధ్వంసం అయింది.

ఏం జరిగింది?

నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన వంశీ హైదరాబాదులో కారు డ్రైవర్​గా పని చేస్తున్నాడు. నిన్న మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడెంలో ఉంటున్న సోదరి ఇంటికి వచ్చిన వంశీ... అతని స్నేహితులైన సాయి, మహేశ్​తో కలిసి ఈదులగూడెం వద్ద అర్ధరాత్రి మద్యం సేవిస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న సీఐ వారిని విచారించారు. మద్యం మత్తులో ఉన్న వంశీ పోలీసు కారుతో పరారయ్యాడు.

ఇలా దొరికింది...

పోలీసుల కళ్లుగప్పి సీఐ వాహనం తీసుకొని వారు కోదాడ వైపు పారిపోతుండగా... యాద్గార్పల్లి వద్ద విధులు నిర్వహించి వస్తున్న రూరల్ ఎస్ఐ పరమేశ్​కి పోలీసులు సమాచారం ఇచ్చారు. వారిని వెంబడించి ఆలగడప టోల్​గేటు వద్ద యువకుల్ని పట్టుకున్నారు. యువకులపై మిర్యాలగూడ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:ప్రేమికుడే హంతకుడా... అత్యాచారం జరిగిందా?

ABOUT THE AUTHOR

...view details