నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని విజయ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి సమయంలో దుకాణంపై రేకులను తొలగించి లోనికి దిగిన ఆగంతుకుడు నగదు, పలు బ్రాండ్లకు చెందిన 18 మద్యం సీసాలను ఎత్తుకెళ్లాడు.
త్రిపురారంలోని విజయ మద్యం దుకాణంలో చోరీ - నల్గొండ నేర వార్తలు
త్రిపురారం మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి సమయంలో షాపులోకి చొరబడిన దొంగ... కొంత నగదు, పలు బ్రాండ్లకు చెందిన 18 మద్యం సీసాలను ఎత్తుకెళ్లినట్లు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

త్రిపురారంలోని విజయ మద్యం దుకాణంలో చోరీ
త్రిపురారంలోని విజయ మద్యం దుకాణంలో చోరీ
మద్యం సీసాల విలువ సుమారు రూ.28,000 ఉంటుందని దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగతనం చేసిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డయింది. వాటి ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:పోలీసులు పట్టించుకోలేదని మహిళ ఆత్మహత్యాయత్నం