యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో రాత్రి చోరీ జరిగింది. మంగళవారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు హుండీ తాళం పగులగొట్టి నగదు దోచుకెళ్లారు. ఉదయం తలుపులు తెలిచిన పూజారి చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఆలయంలో చోరీ.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు - రేణుక ఎల్లమ్మ ఆలయం వార్తలు
భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. ఉదయం ఆలయం తెరిచిన పూజారి చోరీ విషయాన్ని గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు.
ఆలయంలో చోరీ... దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఆలయంలోని హుండీని రెండు నెలలకు ఒకసారి లెక్కిస్తారు. బుధవారం లెక్కించాల్సి ఉండగా... చోరీ జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సుమారు రెండు లక్షల విలువ గల నగదు పోయి ఉంటుందని వెల్లడించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని... వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:దారుణం: ఆస్తి కోసం అమ్మనాన్నలకే చెప్పుల దండ