కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలో ఇంటి డాబాపై నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై ముగ్గురు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. అతని వద్ద ఉన్న 6వేల 500 నగదు, చెవిపోగు, ఇతర ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉంగరాలు రాకపోవడంతో చేతిని గాయపరిచి.... కాళ్లు చేతులు కట్టేసి వెళ్లినట్లు తెలిపాడు. తెల్లవారిన తర్వాత చరవాణి ద్వారా స్థానికులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కట్లువిప్పి ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.
నిద్రిస్తున్న వ్యక్తిపై దుండగుల దాడి.. నగదు, బంగారం చోరీ - కామారెడ్డి జిల్లాలో నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై దుండగులదాడి
ఇంటిడాబాపై నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. అనంతరం 6వేల 500 నగదు, బంగారు చెవిపోగును ఎత్తుకెళ్లారు. చేతి ఉంగరాలు రాకపోవడంతో చేతిని గాయపరిచి దోచుకెళ్లారు.
నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై దుండగులదాడి.. ఆపే నగదు, బంగారం చోరీ
TAGGED:
CHORI AT KAMAREDDY DISTRICT