హైదరాబాద్ మంగళహాట్ ఆర్య సమాజ్ వద్ద పతంగుల దుకాణంపై ఎస్ఐ జగన్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. వారి వద్ద నుంచి నిషేధిత 59 చైనా మాంజాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పతంగుల దుకాణం యజమాని రాకేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పతంగుల దుకాణంపై దాడులు.. చైనా మాంజా స్వాధీనం - telangana news
పక్షులకు హాని చేసే చైనా మాంజాను మంగళహాట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పతంగుల దుకాణం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలెవరూ ఈ మాంజాను కొనకూడదని సీఐ రణవీర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
![పతంగుల దుకాణంపై దాడులు.. చైనా మాంజా స్వాధీనం china manja seized by mangalhat police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10131889-1080-10131889-1609861742172.jpg)
పతంగుల దుకాణంపై దాడులు.. చైనా మాంజా స్వాధీనం
చైనా మాంజా వల్ల పక్షులకు ప్రమాదమని.. ప్రభుత్వం రద్దు చేసింది. ప్రజలెవరూ వీటిని కొనకూడదని సీఐ రణవీర్రెడ్డి కోరారు.
ఇదీ చూడండి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం