తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రూ.10 కోట్ల విలువైన కేబుల్​ను కత్తిరించిన చైనా ఇంజినీర్ అరెస్ట్

ఏపీ చిత్తూరు జిల్లా వికృతమాలలో ఏర్పాటు చేసిన కంపెనీలో యంత్రాలు అమర్చేందుకు వచ్చిన చైనా ఇంజినీరు... కేబుల్ కత్తిరించి కంపెనీకి నష్టాన్ని కలిగించిన కేసులో అరెస్టయ్యాడు. యంత్రాల్లోని విలువైన కేబుల్​లను కత్తిరించి కంపెనీకి రూ. 10 కోట్ల నష్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.

china-engineer-arrested-for-cutting-cable-worth-rs-dot-10-crore-in-erpedu-mandal-chittor-district
రూ.10 కోట్ల విలువైన కేబుల్​ను కత్తిరించిన చైనా ఇంజినీర్ అరెస్ట్

By

Published : Oct 29, 2020, 10:36 AM IST

ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాలలో ఓ కంపెనీలో కేబుళ్లను కత్తిరించి నష్టానికి కారణమైన చైనా ఇంజినీర్​ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాక్స్‌ లింక్స్‌ ఇన్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో యంత్రాలు అమర్చేందుకు ఫాంగ్‌ చెంజిజ్‌ అనే ఇంజినీరు చైనా నుంచి వచ్చాడు.

యంత్రాలు బిగించే సమయంలో వాటిలోని విలువైన కేబుళ్లను కత్తిరించినట్లు కంపెనీ నిర్వాహకులు గుర్తించారు. సంస్థకు రూ. 10 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఈనెల 21న ఏర్పేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరో చైనా కంపెనీకి చెందిన ఓ వ్యక్తి ఆదేశాల మేరకే ఈ తప్పిదానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

ఇవీచూడండి:ఒక్కసారైనా సొనాల 'రైతు వేదిక' చూడాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details