తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చైల్డ్​ పోర్నోగ్రఫీ సెర్చ్​ చేసిన ఇద్దరి అరెస్టు - ఇంట్​నెట్​లో చైల్డ్ పోర్నోగ్రఫీ సర్చ్​

ఇంటర్​నెట్​లో చైల్డ్​ పోర్నోగ్రఫీ సెర్చ్ చేసి, ఫొటోలు, వీడియోలు అప్​లోడ్​ చేసిన ఇద్దరు వ్యక్తులను తార్నాక పోలీసులు అరెస్టు చేశారు. నిషేధిత చైల్డ్ పోర్నోగ్రఫీని ఎవరు సర్చ్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.

child pornography search people arrest in hyderabad
చైల్డ్​ పోర్నోగ్రఫీ సెర్చ్​ చేసిన ఇద్దరి అరెస్టు

By

Published : Aug 6, 2020, 10:19 PM IST

ఇంటర్​నెట్​ చైల్డ్ పోర్నోగ్రఫీ సర్చ్ చేసి, ఫొటోలు, వీడియోలు అప్​లోడ్​ చేసిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారతదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా చైల్డ్ పోర్నోగ్రఫీ నిషేదించారు. ఎవరు సర్చ్ చేసినా, ఫోటోలు, వీడియోలు అప్​లోడ్​ చేసినవారి వివరాలు... అన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లో రికార్డ్ అవుతాయి. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 మంది వివరాలు ఎన్​సీఆర్​బీ అధికారులు సీఐడీకి పంపించారు.

ఈ 15 మందిలో హైదరాబాద్​కి చెందిన ఇద్దరు వ్యక్తుల వివరాలను హైదరాబాద్ పోలీసులకు ఇవ్వగా... మరో 13 మంది వివరాలను ఆయా జిల్లాల పోలీసులకు అధికారులకు పంపించారు. 2019 సంవత్సరంలో సర్చ్ చేసిన తార్నాకకు చెందిన మహమ్మద్ ఫెరోజ్, కాచిగూడకు చెందిన ప్రశాంత్ కుమార్ అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు రిమాండ్​కు తరలించారు. నిషేధిత చైల్డ్ పోర్నోగ్రఫీని ఎవరు సర్చ్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details