మహారాష్ట్ర వార్థ జిల్లా ఆర్వీ గ్రామానికి చెందిన సంజీవ్ సింగ్, పూజ కుటుంబ సభ్యులు గత 20 రోజుల నుంచి కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఆయుర్వేద మందులు విక్రయిస్తున్నారు. అయితే రోజు మాదిరిగానే గురువారం కూడా మందులు అమ్మారు. రాత్రివేళవడం వల్ల అందరూ పడుకున్నారు. తెల్లారి లేచి చూసేసరికి వారి రెండు నెలల చిన్నారి మోహిత్ కనిపించలేదు. చుట్టుపక్కల అంతటా వెతికినా కనిపించకపోయే సరికి స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.
జంగంపల్లి ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద చిన్నారి కిడ్నాప్ - కామారెడ్డి జిల్లా నేరవార్తలు
కామారెడ్డి జిల్లా జంగంపల్లి శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద మోహిత్ అనే రెండు నెలల చిన్నారిని ఆగంతుకులు అపహరించారు. బాలుడు కనిపించకపోయేసరికి ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ మోహిత్‌ను పట్టుకుంటామని డీఎస్పీ లక్ష్మీనారాయణ వారికి భరోసా కల్పించారు.
కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులు ఉంటున్న ప్రదేశాన్ని కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ, కామారెడ్డి రూరల్, భిక్కనూర్ సీఐలు పరిశీలించి విచారణ నిర్వహిస్తున్నారు. చిన్నారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ లక్ష్మీనారయణ తెలిపారు. పిల్లలు లేని వారు, పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేవారే ఇలాంటి ఘటనలకు పాల్పడతారని ఆయన పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరలో మోహిత్‌ను పట్టుకుంటామని వెల్లడించారు.
ఇవీ చూడండి: ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల